ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

Published on Mon, 09/22/2025 - 16:38

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.

ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.

తప్పుల నుంచి నేర్చుకోకపోతే..
ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు 29%, టెక్ లీడర్‌లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.

జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.

మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.

ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)