Breaking News

ఏం చేసినా పడుండాలా?, బాస్‌కి దిమ్మతిరిగేలా రిప్లై..డేరింగ్‌ లేడీ అంటున్న నెటిజన్లు!

Published on Sun, 07/30/2023 - 21:42

కొత్త జాబ్‌, ఆఫీస్‌. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్‌. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్‌ వాతావరణం, బాస్‌ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్‌కు రిజైన్‌ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.    

ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్‌, ఆఫీస్‌ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు.

‘బాస్‌ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు.   

​ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్‌ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్‌ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది.

చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్‌ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్‌.. మంచి నిర్ణయం తీసుకున్నావ్‌, నువ్వు డేరింగ్‌ లేడీ అంటూ అభినందిస్తున్నారు.

     I quit after 3 days
by      u/QueenMangosteen in      antiwork    

చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)