Breaking News

రొమాన్స్ స్కామ్: రూ.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ

Published on Fri, 09/05/2025 - 15:04

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు ఎంతచెప్పినా.. ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన 80 ఏళ్ల మహిళ.. వ్యోమగామినని చెప్పుకుని పరిచయమైన మోసగాడి భారినపడి దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది.

జపాన్‌లోని ఉత్తరాన ఉన్న హక్కైడోకు చెందిన 80 ఏళ్ల మహిళ.. జూలైలో సోషల్ మీడియాలో తాను వ్యోమగామి అని చెప్పుకునే స్కామర్‌ను కలిసింది. కొంత సంభాషణ తరువాత.. తాను ప్రస్తుతం అంతరిక్ష నౌకలో.. అంతరిక్షంలో ఉన్నానని, ఆక్సిజన్ అవసరం ఉందని మహిళతో చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని ఆమెను కోరాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆ మోసగాడిపై ప్రేమ పెంచుకుని.. 5000 పౌండ్లు (సుమారు రూ.6 లక్షలు) డబ్బు పంపింది. చివరకు మోసపోయానని తెలుసుకుంది.

చివరికి చేసేదేమీ లేక పోలీసులను సంప్రదించింది. వారు దీనికి 'రొమాన్స్ స్కామ్' (అపరిచిత వ్యక్తులపై ప్రేమ పెంచుకోవడం) అని పేరుపెట్టారు. సోషల్ మీడియాలో మీకు పరిచయమైన వారు.. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తే.. దయచేసి స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పోలీసు అధికారి హెచ్చరించారు.

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాల జాబితాలో జపాన్ ఒకటి. దీంతో ఇక్కడ మోసాలు పెరుగుతున్నాయి. జపాన్ నేషనల్ పోలీసు ఏజెన్సీ ప్రకారం.. 2024 మొదటి 11 నెలల్లో 3,326 రొమాన్స్ స్కామ్‌లు నమోదయ్యాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.

గతంలో రొమాన్స్ స్కామ్‌లు 
వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇలాంటి రొమాన్స్ స్కామ్‌లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆన్‌లైన్‌ మోసగాళ్ల వలలో పడి రూ.4.3 కోట్లకు పైగా పోగొట్టుకుంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైనా.. అపరిచితుడు మలేషియాలోని కౌలాలంపూర్‌లో తన పర్సు దొంగిలించబడినందున తనకు రూ.2,75,000 అవసరమని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ మహిళ డబ్బు పోగొట్టుకుంది.

ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు