Breaking News

ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో

Published on Wed, 01/21/2026 - 15:30

ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.

పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్‌కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి  కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్‌ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ మార్పు భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్‌తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.

గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు 

Videos

Viral Video: నంద్యాల బస్సు ప్రమాదం CCTV వీడియో

YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు

YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్

YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది

13 రూపాయల వడ్డీ టైం కి ఇవ్వకపోతే అంతు చూస్తా..!

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

ఆగిపోయిన డ్రాగన్ షూటింగ్.. ఎన్టీఆర్ కు ఏమైంది..?

Kakinada : రోడ్లు వేయకపోతే.. గిరిజనుల వార్నింగ్

Photos

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)

+5

కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌..తొలి టి20లో భారత్‌ ఘనవిజయం (ఫొటోలు)

+5

అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్‌ (ఫోటోలు)

+5

ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష‍్మీరాయ్ పూజలు (ఫొటోలు)

+5

ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ పూజా కార్యక్రమం (ఫొటోలు)