Breaking News

భారత్ ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. కానీ..: ట్రంప్ సుంకాలపై ఆర్‌బీఐ చీఫ్‌

Published on Thu, 08/07/2025 - 07:51

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్‌ అమల్లోకి రానుంది. ఈ తరుణంలో.. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ 'సంజయ్‌ మల్హోత్రా' చెప్పారు.

అమెరికా సుంకాల ప్రభావం మన దేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే భారత్ వృద్ధిపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండం కొంత కష్టమని సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఎందుకంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. సుంకాల ప్రభావం వాణిజ్య సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.

భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటియికీ.. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితులు వంటివన్నీ దేశాభివృద్ధికి కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. భారత ఆర్థిక వ్యవస్థ తన సముచిత స్థానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి దేశంలోని అన్ని రంగాలు కీలకని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్‌ ఇండియా

డెడ్‌ ఎకానమీ కాదు..
భారత ఆర్థిక వ్యవస్థను డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోంది. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్‌ అంచనాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్‌ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తామని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)