Breaking News

ఈఎంఐలు క్రమంగా చెల్లిస్తున్నా సిబిల్‌ తగ్గుతోందా?

Published on Wed, 07/29/2026 - 10:25

ప్రతి నెలా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లిస్తున్నప్పటికీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోవడం చాలామంది రుణగ్రహీతలను గందరగోళానికి గురిచేస్తుంటుంది. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నా స్కోర్ ఎందుకు తగ్గుతోందనే సందేహం సహజమే. అయితే, క్రెడిట్ స్కోర్ లెక్కింపులో సమయానికి చెల్లింపులు చేయడం అనేది ఒక భాగం (దాదాపు 35% వెయిటేజీ) మాత్రమే. మిగిలిన 65% స్కోర్ ఇతర కీలక ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరగడం

మీకున్న మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ లిమిట్‌ వాడటం స్కోరును దెబ్బతీస్తుంది. బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించినప్పటికీ స్టేట్‌మెంట్ జనరేట్ అయ్యే సమయానికి మీ వినియోగం ఎక్కువగా ఉంటే సిబిల్ దాన్ని అధిక రుణం తీసుకునే అలవాటు ఉందని పరిగణిస్తుంది.

పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయడం

పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. అంతేకాకుండా, మీ క్రెడిట్ హిస్టరీ కాలపరిమితి తగ్గి సగటు ఖాతా డ్యూరేషన్‌ చిన్నదవుతుంది. ఇది సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

స్వల్పవ్యవధిలో ఎక్కువ దరఖాస్తులు

తక్కువ సమయంలో వివిధ బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ యాప్‌లలో రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం పదేపదే దరఖాస్తు చేస్తే బ్యాంకులు హార్డ్ ఎంక్వైరీలు చేస్తాయి. ఇది రుణగ్రహీత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాడనే సంకేతాన్ని ఇస్తుంది.

గ్యారెంటర్/కో-అప్లికెంట్ డిఫాల్ట్‌లు

మీరు వేరొకరి రుణానికి గ్యారెంటర్‌గా లేదా జాయింట్ లోన్ కో-అప్లికెంట్‌గా ఉంటే వారు చెల్లింపుల్లో ఆలస్యం చేసినా లేదా డిఫాల్ట్ అయినా ఆ నెగెటివ్ ప్రభావం మీ స్కోర్‌పై కూడా పడుతుంది.

సిబిల్ రిపోర్టులో తప్పుడు సమాచారం

బ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోల వైపు నుంచి జరిగే సాంకేతిక లోపాల వల్ల మీ ఖాతాలో నమోదు కాలేని చెల్లింపులు లేదా వేరొకరి రుణాలు మీ రిపోర్టులో కనిపించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు!

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)