Breaking News

అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య

Published on Mon, 11/03/2025 - 11:51

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

జప్తు చేసిన ఆస్తుల వివరాలు

మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.

అసలు కేసు ఏంటి?

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌ యెస్ బ్యాంక్‌ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్‌ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్‌ సంస్థలు విఫలమయ్యాయి.

ఈడీ దర్యాప్తులో అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)