రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..

Published on Sat, 10/18/2025 - 13:47

భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.

నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయం

వ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.

రుణాల దుర్వినియోగం

కొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.

పూచీకత్తు సమస్యలు

చిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.

వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.

రుణమాఫీ జాప్యం

గత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)