Breaking News

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీకి యాపిల్‌, శామ్‌సంగ్‌ నోటీసులు

Published on Thu, 08/28/2025 - 10:04

భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ పోటీ సంస్థల ఉత్పత్తులను నేరుగా ప్రకటనల్లో పోలుస్తూ వివిధ మాధ్యమాల ద్వారా యాడ్‌లు ఇస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల యాపిల్, శామ్‌సంగ్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా పోల్చే ప్రకటనలను ఉటంకిస్తూ షావోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రత్యర్థి మార్కెటింగ్ వ్యూహాలను కట్టడి చేస్తూ, తమ బ్రాండ్ విలువను కాపాడుకోవడానికి మార్కెట్ లీడర్లు చేస్తున్న రక్షణాత్మక చర్యలను ఈ లీగల్ నోటీసులు హైలైట్‌ చేస్తున్నాయి.

వివాదానికి కారణం

ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్, కొన్ని శామ్‌సంగ్‌ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఈ ప్రచారం చేసిందని సమాచారం. ఇటీవల షావోమీ 15 అల్ట్రా మోడల్‌ ప్రకటనలను ఉంటకిస్తూ ధర, స్పెసిఫికేషన్లపై యాపిల్ ఐఫోన్‌ 16 ప్రోమ్యాక్స్‌తో ప్రత్యక్ష పోలికలున్నట్లు తెలిపింది.  సోషల్ మీడియాలో ఎంపిక చేసిన శామ్‌సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఇదే విధానాన్ని అనుసరించిందని కొన్ని సంస్థలు తెలిపాయి.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ

యాపిల్, శామ్‌సంగ్‌ జారీ చేసిన లీగల్ నోటీసులు వాటి బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరగకుండా ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రాండ్ కన్సల్టెంట్ హరీష్ బిజూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు బ్రాండ్ వాల్యుయేషన్‌కు ముప్పుగా వాటిల్లుతున్నాయి. వీటిపై చట్టపరమైన చర్యలు ఎంతో అవసరం’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై షావోమీ అధికారంగా స్పందించాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)