Breaking News

ఐటీ రిటర్నులు ఎవరు ఫైల్‌ చేయాలి..?

Published on Mon, 06/30/2025 - 11:20

ఇదొక ప్రశ్నా..? అనుకోకండి... ఆదాయం అంటే నికర ఆదాయం లేదా టాక్సబుల్‌ ఇన్‌కం బేసిక్‌ లిమిట్‌ దాటిన ప్రతి వ్యక్తీ, ప్రతి ఏటా విధిగా, కచ్చితంగా సకాలంలో రిటర్నులు దాఖలు చేయాలి. ఇదొక ప్రాథమిక సూత్రం. ఫాలో అవ్వండి. చట్ట ప్రకారం, వ్యక్తులకు ఎటువంటి ఆదాయం లేకపోయినా బేసిక్‌ లిమిట్‌ పరిధిలోకి వస్తారు. టాక్స్‌బుల్‌ ఇన్‌కం ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులు చేయాల్సిందే. ఇటువంటి వ్యక్తులు ఎవరు? ఏమిటా సందర్భము? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..

  • మీరు ఒక సంవత్సరం కాలం, అంటే ఓ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయిలు దాటి బ్యాంకులో డిపాజిట్‌ చేశారనుకొండి. మీరు రిటర్ను వేయాల్సిందే. అమెరికా నుంచి మీ అబ్బాయి రూ.కోటి దాటి పంపితే, అది మీ అకౌంటులో జమ కాబట్టి మీరు రిటర్ను వేయాలి. సాంకేతికంగా ఒక సలహా.. మీ అకౌంట్లో కోటి లోపు, మీ జీవిత భాగస్వామి అకౌంట్‌లో కోటి లోపు వేసినట్లయితే ఈ బాధ్యత నుంచి బయట పడవచ్చు. ఇటువంటి బదిలీల వలన మీకు ఎటువంటి పన్ను భారం మాత్రం ఉండదు.

  • మీరు ఓ కంపెనీకి డైరెక్టర్‌ అనుకోండి. లేదా లిమిటెడ్‌ పార్టనర్‌ షిప్‌లో భాగస్వామి అనుకోండి. జీతం/పారితోషికం/కమీషన్‌ ఏమీ తీసుకోకపోయినా రిటర్ను వేయాల్సిందే. దగ్గరి వారో లేదా మిత్రులో.. ప్రోద్బలం వల్ల కంపెనీ పెట్టవచ్చు. లిమిటెడ్‌ పార్టనర్‌షిప్‌లో చేరవచ్చు. మీకు ఎటువంటి బరువు, బాధ్యతలు ఉండకపోవచ్చు. కానీ రిటర్ను మాత్రం వేయాలి. మీకు చెప్పుకుండా మీ పేరు కూడా వాడుకోవచ్చు. తగిన జాగ్రత్త వహించాలి.

  • విదేశీయానం మీద రూ.2 లక్షలు దాటి పెట్టారనుకోండి. మీరు రిటర్ను దాఖలు చేయాలి. అలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందీ, పన్ను భారం ఉండకపోవచ్చు. మీ అబ్బాయో/అమ్మాయో టికెట్‌ కొనమనండి. ఆ డబ్బుల్ని వారిని చెల్లించమనండి.

  • మీకు కరెంట్‌ బిల్లు సంవత్సరంలో రూ.ఒక లక్ష దాటింది అనుకొండి. ఆ షాక్‌తో పాటు రిటర్ను దాఖలు షాక్‌ కూడా మీ నెత్తిన పడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లలో మీ పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. అన్నీ కలిపి మీ పేరు మీద బిల్లు రూ.లక్ష దాటింది అనుకోండి. మీకు ఈ బాధ్యత వర్తిస్తుంది. కరెంటు బిల్లు.. ఇంటికి, బిల్డింగ్‌కి, అపార్ట్‌మెంట్‌కి, కమర్షియల్‌ ప్రాపర్టీకే కాదు ఒక వ్యక్తికి వస్తుంది. ఇలాంటి జాబితాలో చాలామంది ఉంటారు. ఉన్నారు. ప్రస్తుతం సమాచార సమన్వయం లేకపోవడంతో వీళ్లు తప్పించుకుంటున్నారు. కానీ కృత్రిమ మేథస్సు వలన ఇవన్నీ బయటపడతాయి.

  • మీ విషయంలో టీడీఎస్‌ రూ.25,000 లేదా ఆపైన జరిగిందనుకోండి. సీనియర్‌ సిటిజన్ల విషయంలో ఈ లిమిట్‌ రూ.50,000గా ఉంటుంది. వీరు రిటర్ను వేయాల్సిందే. వెంటనే ఫారం 16/ఫారం 16ఏ చెక్‌ చేసుకోండి. ‘నిప్పు లేనిదే పొగరాదు’ మాదిరిగా ఏదొక వ్యవహారం జరగనిదే టీడీఎస్‌ కోత తప్పదు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టే సందర్భమే... ఈ రిటర్ను వేయడం.

  • మీ వ్యాపారం/బిజినెస్‌/వసూళ్లు/ అమ్మకాలు సంవత్సర కాలంలో రూ.60 లక్షలు దాటాయనుకోండి. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఇది బయటపడుతుంది. అలాగే వృత్తి పరంగా వచ్చే ఆదాయం ఏటా రూ.10 లక్షలు దాటిందంటే రిటర్ను వేయాలి. ఈ రెండు కేసుల్లోనూ నికర ఆదాయంతో సంబంధం లేదు. లాభనష్టాలతో అసలు పనేంలేదు. రిటర్ను వేయాలి.

  • టీడీఎస్‌ జరిగింది.. ఆదాయం టాక్స్‌బుల్‌ ఇన్‌కం లోపల ఉన్నా, ఆదాయం ఏమాత్రం లేకున్నా, పన్ను భారానికి మించి టాక్స్‌ కట్‌ చేసినా రిఫండ్‌ పొందాలి. రిఫండ్‌ కోసం రిటర్ను వేయాల్సిందే.

ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు

చివరిగా, మీకు రుణాల మంజూరు, విదేశీ ప్రయాణాలకు వీసాలు లాంటి విషయాల్లో .. గౌరవం, పరపతి, గుర్తింపు ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి రిటర్నులు వేయడంపై దృష్టి పెట్టండి. ఎగవేత మార్గాన్ని ఎంచుకోకండి.


 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)