ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌

Published on Sat, 08/02/2025 - 16:14

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ గత జూన్‌ నెలలో భారత్‌లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్‌ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్‌లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్‌ చేసింది.

వాట్సాప్‌లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.

ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్‌లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)