Breaking News

74 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌! ఒక్క నెలలోనే..

Published on Mon, 10/02/2023 - 16:15

WhatsApp Accounts Banned: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ (WhatsApp) భారత్‌లో ఒక్క నెలలోనే ఏకంగా 74 లక్షల అకౌంట్లు బ్యాన్‌ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు నెలలో 74 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్‌ తాజాగా విడుదల చేసిన ఇండియా నెలవారీ నివేదిక పేర్కొంది.

ఆగస్టు నెలలో మొత​ం 74 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేయగా వీటిలో 35 లక్షల అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. సంబంధిత అకౌంట్లపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతో పాటు ప్లాట్‌ఫామ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్‌ సొంతంగా తీసుకున్ననివారణ చర్యల వివరాలు 'యూజర్-సేఫ్టీ రిపోర్ట్'లో ఉన్నాయి.

ఆగస్టు 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య, మొత్తం 74,20,748 వాట్సాప్ ఖాతాలను బ్యాన్‌ చేశామని, వీటిలో 3,506,905 ఖాతాలపై యూజర్ల నుంచి ఫిర్యాదుల రాకపోయినా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. 

జూన్‌లోనూ 66 లక్షలు
వాట్సాప్‌ గత జూన్ నెలలోనూ 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)