Breaking News

'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

Published on Sun, 05/03/2026 - 19:19

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పాసివ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.

పూర్తిగా యాక్టివ్ వర్క్
ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు.

 
 

కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్‌కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.

పాసివ్ ఇన్‌కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలు

  • మొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.

  • రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. 

  • మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.

మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్‌కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.

చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.

ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)