Breaking News

20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్‌ఫాదర్‌ సలహా

Published on Fri, 10/25/2024 - 14:12

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్‌ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్‌’గా పరిగణించబడే ఫ్రెంచ్‌-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్‌ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.

‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ వైపు తమ కెరియర్‌ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్‌’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్‌ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.

ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?

యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్‌ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్‌ గుర్తు చేశారు. ఇది లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ మోడళ్ల(ఎల్‌ఎల్‌ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్‌డేట్‌ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి.
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)