Breaking News

వార్‌.. బేర్‌! 

Published on Thu, 03/05/2026 - 00:19

ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్‌ జోరు’ కొనసాగింది. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్‌ స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్‌ 1,123 పాయింట్లు పతనమై  79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది.  

ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి  24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి.  

బీఎస్‌ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్‌ ఇండెక్స్‌ 4%, పీఎస్‌యూ బ్యాంక్‌ 3.50%, ఇండ్రస్టియల్స్‌ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్‌ 3.12%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్‌ 2.25%, పతనమమ్యాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌లో  30 షేర్లలో  ఎయిర్‌టెల్‌ (1.78%), ఇన్ఫోసిస్‌ (1.5%), టెక్‌ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. 

→ పీఎన్‌జీఎస్‌ రేవా డైమండ్‌ జ్యువెలరీ లిస్టింగ్‌ రోజు మెరిసింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్‌ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.

ఆయిల్‌ మార్కెటింగ్, పెయింట్స్‌ షేర్లు డౌన్‌ 
గల్ఫ్‌ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్, పెయింట్‌ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌పీసీఎల్‌ 5.41%, బీపీసీఎల్‌ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్‌ పెయింట్స్‌ 2.6%, బర్జర్‌ పెయింట్స్‌ 2.22%, ఇండిగో పెయింట్స్‌ 1.49%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.95 పడిపోయాయి. 
ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం:  దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్‌లాండ్‌ ‘సెట్‌ కాంపోసిట్‌’ సూచీ 6%, ఇండోనేసియా  ‘జకార్తా కాంపోసిట్‌’ 5% పతనమయ్యాయి.  తైవాన్‌ 4.50%, జపాన్‌ 4%, సింగపూర్‌ 2.16%, హాంగ్‌కాంగ్‌ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు  రికవరీ బాట పట్టాయి.  జర్మనీ డాక్స్‌ 2%, ఫ్రాన్స్‌ సీఏసీ 1%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ అరశాతం లాభపడ్డాయి.  నాస్‌డాక్‌ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్‌ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)