Breaking News

పెట్టుబడులకు బూస్ట్‌.. వడ్డీరేట్ల కట్‌!

Published on Tue, 04/07/2026 - 05:31

న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. 

కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్‌లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. 

ముందుంది గడ్డుకాలం... 
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్‌ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్‌ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
 

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)