Breaking News

చిన్నగానే చుట్టేసొద్దాం..

Published on Wed, 12/24/2025 - 02:31

సాక్షి, బిజినెస్‌డెస్క్‌: కరెన్సీ కదలికలు, క్రిస్మస్‌..న్యూ ఇయర్‌ సీజన్‌ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్‌ సర్విసుల కంపెనీ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్‌ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.

65 శాతం బుకింగ్స్‌ అయిదు రోజుల్లోపు ట్రిప్‌లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్‌ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్‌ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది.  

రిపోర్టులో మరిన్ని విశేషాలు.. 
మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్‌ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్‌ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.  

 ఆఖరు నిమిషంలో బుక్‌ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్‌లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్‌కి, జెనరేషన్‌ జెడ్‌కి, యువ జంటలకి, బ్యాక్‌ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్‌గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్‌ సీజన్‌ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్‌ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి.  

శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్‌ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. 
ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్‌లో అత్యధిక వాటా దుబాయ్‌ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి.      

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు