Breaking News

వారెన్‌ బఫెట్‌ చెప్పిన సక్సెస్‌ సీక్రెట్‌..

Published on Sun, 10/19/2025 - 20:30

ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్.. తన సంపత్తి కంటే ఎక్కువగా తన పెట్టుబడి మేథసంపత్తికి, పట్టుదలకి, దాతృత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధ బిలియనీర్లలో ఒకరైన ఆయన, టీనేజ్‌లోనే తన మొదటి పెట్టుబడి పెట్టారు. ‘1% క్లబ్‌’లో భాగంగా, తన సంపాదనలో 99 శాతాన్ని  స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసిన బఫెట్.. తన దాతృత్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

బఫెట్ విజయం వెనుక అలవాట్ల పాత్ర ఎక్కువ
వారెన్ బఫెట్‌ (Warren Buffett) జీవిత సూత్రం "తక్కువగా పనిచేయడం కాదు, కానీ తెలివిగా జీవించడం". ప్రతిరోజూ చదవడం, త్వరగా పడుకోవడం, ఏ పనినైనా ప్రారంభించే ముందు చక్కగా ఆలోచించడం ఆయన దైనందిన జీవితంలోని అలవాట్లు. ఇవి సింపుల్‌ కనిపిస్తాయి. కానీ ప్రభావవంతమైనవి. వాస్తవానికి, బఫెట్ రోజులో 80 శాతానికి పైగా చదవడం, ఆలోచించడానికే కేటాయిస్తారు. కొన్ని రోజుల్లో ఇది 6 గంటల దాకా ఉంటుంది.

అలవాట్ల శక్తి గురించి బఫెట్ ఆసక్తికర ఉదహరణ
ఒకసారి, యువ విద్యార్థులతో మాట్లాడుతుండగా, బఫెట్ అలవాట్ల రూపకల్పనలో ఉన్న "అదృశ్య శక్తి" గురించి ఆసక్తికరంగా వివరించారు. "మీరు గౌరవించే ఇద్దరు వ్యక్తులు, అలాగే మీకు అసహ్యంగా అనిపించే మరో వ్యక్తిని తీసుకోండి. తరువాత, ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను పేపర్‌పై రాయండి" అంటూ సూచించారు.

ఈ ప్రక్రియ ద్వారా బఫెట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే.. "మీరు ఆదర్శంగా భావించే వ్యక్తుల లక్షణాలు మీకూ సాధ్యమైనవే. కొంత అభ్యాసం చేస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారగలరు. ఇవి అలవాట్లుగా మారినపుడు, అవే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి".

అలవాట్లు ఎలా ఏర్పడతాయో, వాటిని చిన్నవయస్సులో ఎలా మార్చగలమో స్పష్టంగా వివరించేందుకు బఫెట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉదాహరణను ప్రస్తావించారు. ఫ్రాంక్లిన్ "ఒక వ్యక్తి కావాలనుకునే లక్షణాన్ని తాను అభ్యసించి అలవాటుగా మార్చుకున్నాడు" అని బఫెట్ చెబుతూ.. "అలవాట్ల గొలుసులు మొదట తేలికగా ఉంటాయి. మనం గుర్తించలేము కూడా. కానీ, అవి గట్టిపడితే, విరగ్గొట్టడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న వయస్సులోనే మంచి అలవాట్లను అభ్యసించండి" అన్నారు.

ఇదీ చదవండి: రిచ్‌ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్‌ డబ్బు’ కాదు..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)