Breaking News

యుద్ధం లాభదాయకమే: కియోసాకి కామెంట్స్‌

Published on Sun, 03/29/2026 - 14:13

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదని చెబుతూనే, అది ఏ విధంగా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందో ఆయన వివరించారు.

నాటి యుద్ధ జ్ఞాపకాలు..
వియత్నాం యుద్ధ కాలం నాటి ఒక నిరసన గీతాన్ని ప్రస్తావిస్తూ.. "యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు" అని ఆయన పేర్కొన్నారు. స్వయంగా వియత్నాం యుద్ధంలో (1966, 1971-72) పాల్గొన్న కియోసాకి, తన స్నేహితులను కోల్పోయిన బాధను గుర్తు చేసుకున్నారు. మూడు వారాల క్రితమే తాను వియత్నాం వెళ్లి తన పాత స్నేహితులకు వీడ్కోలు పలికి, మనశ్శాంతిని పొందినట్లు ఆయన తెలిపారు.

యుద్ధం వల్ల భారంగా మారుతున్న సామాన్యుడి జీవితం
ప్రస్తుతం 'పవిత్ర భూముల్లో' (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కేవలం ప్రాణనష్టం మాత్రమే కాకుండా, యుద్ధానికి దూరంగా ఉన్న దేశాల్లోని ప్రజలు కూడా ద్రవ్యోల్బణం (Inflation)  వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు. యుద్ధాల వల్ల దేశాల అప్పులు విపరీతంగా పెరుగుతాయన్నారు. పెరిగే ధరల వల్ల సామాన్యుడు పేదరికంలోకి నెట్టబడతాడని, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన విశ్లేషించారు.

సంక్షోభంలోనే సంపద సృష్టి
యుద్ధం అనేది మానవత్వానికి నష్టమే అయినా, ఆర్థికంగా అది కొంతమందికి లాభాలను తెచ్చిపెడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. "యుద్ధం వల్ల దేశాలు అప్పుల ఊబిలో ఉన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు. సరైన ఆర్థిక విద్య (Financial Education) ఉంటే ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధనవంతులు కావచ్చు" అని ఆయన సూచించారు.  మీ మెదడు, మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే మీ గొప్ప ఆస్తులని, మంచి గురువులను ఎంచుకుని ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)