Breaking News

స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!

Published on Thu, 03/05/2026 - 13:18

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్‌ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

భారతీయ పెట్టుబడిదారుల ‘బ్రేక్‌’
దుబాయ్‌ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బీచ్‌ఫ్రంట్‌ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు చెబుతున్నారు.

భద్రమైన పెట్టుబడి కేంద్రం… ఇప్పుడు సందేహాలు
ఇప్పటివరకు దుబాయ్‌ పెట్టుబడిదారులకు ‘సేఫ్‌ హేవన్‌’ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిస్సైల్‌ దాడుల భయం, ఎయిర్‌స్పేస్‌ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.

దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇది కేవలం సెంటిమెంట్ ఆధారిత 'బ్లిప్' మాత్రమేనని డనుబే గ్రూప్‌ వంటి డెవలపర్లు అంటున్నారు.

దుబాయ్‌కి ప్రత్యామ్నాయం ఏది? 
ఈ నేపథ్యంలో ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ అయింది. దుబాయ్ బదులు ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి భారతీయ నగరాలను ప్రత్యామ్నాయాలుగా సూచించారు. దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు భారత్‌లోని ఏ నగరమూ దుబాయ్ స్థాయికి చేరదని, ట్యాక్స్ లాభాలు, లగ్జరీ ఇన్ఫ్రా, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ దుబాయ్‌కే ఉన్నాయని వాదిస్తున్నారు. మరికొందరు గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య)ను భవిష్యత్ పోటీదారుగా చూస్తున్నారు.

డీల్స్‌ ఆగినా… పూర్తిగా కుదేలుకాదు
దుబాయ్‌లో ప్రస్తుతం కొన్ని ప్రాపర్టీ ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచినా పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే త్రైమాసికంలో నిలిచిపోయిన డీల్స్‌లో 60%–80% వరకు పూర్తి అయ్యే అవకాశం  ఉందని అంచనా.

క్లిక్‌ చేయండి 👉 దుబాయ్‌ దాటని బంగారం.. 

ధరలపై ప్రభావం?
కొనుగోళ్లు మందగిస్తే వచ్చే కొన్ని నెలల్లో ధరలపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భారీగా కొత్త గృహ ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)