Breaking News

8 వేల మంది ప్రొఫెషనల్స్‌కి  ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ 

Published on Tue, 07/22/2025 - 04:51

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ (వీజీఎస్‌) తెలిపింది. కాంటాక్ట్‌ సెంటర్‌ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్‌ టూల్‌తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది.

 కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్‌ సెంటర్, కస్టమర్‌ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్‌ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. 

ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్‌ ప్రెసిడెంట్‌ గగన్‌ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)