Breaking News

ఎఫ్‌డీఐల్లో అమెరికా, సింగపూర్‌ టాప్‌ 

Published on Thu, 10/30/2025 - 06:03

ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) మూడో వంతు వాటాతో అమెరికా, సింగపూర్‌ అగ్రస్థానంలో నిల్చాయి. మొత్తం రూ. 68,75,931 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా అమెరికా వాటా 20 శాతంగా, సింగపూర్‌ది 14.3 శాతంగా ఉంది. మారిషస్‌ (13.3 శాతం), బ్రిటన్‌ (11.2 శాతం), నెదర్లాండ్స్‌ (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫారిన్‌ లయబిలిటీస్, అసెట్స్‌ (ఎఫ్‌ఎల్‌ఏ)పై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 45,702 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో 41,517 సంస్థలు తమ బ్యాలెన్స్‌ షీట్స్‌లో ప్రస్తావించాయి. 

ఇందులో నాలుగింట మూడొంతుల సంస్థలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్‌ వేల్యూ ప్రకారం మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడుల్లో తయారీ రంగం అత్యధిక వాటా దక్కించుకోగా, సర్వీసుల రంగం రెండో స్థానంలో నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐల పరిమాణం రూ. 61,88,243 కోట్లుగా నమోదైంది. మరోవైపు, తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ. 11,66,790 కోట్లుగా నమోదైంది. ఇందులో సింగపూర్‌ వాటా 22.2 శాతంగా, అమెరికా వాటా 15.4 శాతంగా ఉంది. బ్రిటన్‌ (12.8 శాతం), నెదర్లాండ్స్‌ (9.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)