Breaking News

ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్

Published on Sat, 04/05/2025 - 18:06

ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' సుంకాలను ప్రకటించిన తరువాత.. యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు సెషన్లలలోనే ఇన్వెస్టర్లు ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. కరోనా మహమ్మారి తరువాత స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమవ్వడం ఇదే మొదటిసారి. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్తాయనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు కూడా ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతుంటే.. ట్రంప్ మాత్రం ఇన్వెస్టర్లు ధనవంతులు అవ్వడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమని, చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వారు ధనవంతులు అవుతారని ఆయన అన్నారు.

పెద్ద కంపెనీలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ టారీఫ్స్ గురించి ఆందోళన చెందవు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మరింత పెద్ద డీల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఇవే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తాయి.. సూపర్ ఛార్జ్ మాదిరిగా పనిచేస్తాయని అన్నారు.

ఇదీ చదవండి: 'అమెరికాలో ఉద్యోగాలుండవు'.. నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే?

విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సుంకాలను ప్రవేశపెట్టారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చి వేయడం మాత్రమే కాకుండా.. దేశంలో ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)