Breaking News

క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

Published on Wed, 07/01/2026 - 12:44

ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.

భద్రతా హామీలతో లభించిన ఊరట

ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్‌ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.

అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..

గత నెలలో(జూన్‌) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.

అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్

ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్‌ రిస్క్‌గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.

మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్‌బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్‌లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్‌ఆఫ్‌!

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)