Breaking News

భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’.. 126% టారిఫ్‌!

Published on Wed, 02/25/2026 - 17:37

భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్‌తోపాటు ఇండోనేషియా, లావోస్‌ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్‌లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్‌కు 126% సుంకాలు
భారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యం
యూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్‌ మాడ్యూల్స్‌లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
(ఇదీ చదవండి: అఫైర్లు నిజమే.. అంగీకరించిన బిల్‌గేట్స్‌)

భారత ఎగుమతిదారుల్లో ఆందోళన
అమెరికా ప్రధాన మార్కెట్‌గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్‌ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్‌కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)