Breaking News

కోట్ల ఆస్తులు.. లక్షల ఆదాయం.. ధర్మేంద్ర ప్రధాన్ నెట్‌వర్త్!

Published on Thu, 07/23/2026 - 18:00

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆస్తులు, ఆదాయం, పెట్టుబడులపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం మొత్తం ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.92 కోట్లు కాగా, అప్పులు రూ.2.30 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు. ఆయన భార్య మృదులా ఠాకూర్ మాత్రం అదే ఏడాది రూ.49.92 లక్షల ఆదాయం పొందారు. చేతిలో నగదు విషయానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద రూ.35 వేలు, ఆయన భార్య వద్ద రూ.40 వేలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల వద్ద కలిపి మరో రూ.17 వేలు నగదు ఉండటంతో కుటుంబం మొత్తం చేతిలో ఉన్న నగదు రూ.92 వేలుగా నమోదైంది.

పెట్టుబడుల విషయానికి వస్తే.. బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులు కలిపి కుటుంబం వద్ద సుమారు రూ.2.47 కోట్లు ఉన్నట్లు సమాచారం. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షలు, బీమా పాలసీల్లో రూ.67.72 లక్షలు పెట్టుబడిగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల నుంచి రూ.31.38 లక్షల లోన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. అలాగే ఘాజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఒక అపార్ట్‌మెంట్, భువనేశ్వర్‌లో మరో నివాస గృహం కలిపి సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లను ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్య కలిగి ఉన్నారు.

2011 మోడల్ హోండా సిటీ కారు, 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి కూడా తమ వద్ద ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.13.5 లక్షలు. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి ఉండగా, వాటి విలువ సుమారు రూ.35 లక్షలు. కంప్యూటర్, గృహోపకరణాలు వంటి ఇతర వస్తువులు కలిపి మరో రూ.6 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: స్కూల్‌లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)