Breaking News

స్టాక్‌ మార్కెట్‌కు బడ్జెట్‌ షాక్‌

Published on Tue, 07/23/2024 - 13:01

భారతీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర  బడ్జెట్‌ సెగ తగిలింది.  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న  ఇన్వెస్టర్లు మార్కెట్‌ ఆరంభంలో సానుకూలంగా  ఉన్నారు. కానీ బడ్జెట్‌ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్‌ గెయిన్స్‌పై టాక్స్‌ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో  సెన్సెక్స్‌ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా,  నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.

ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్‌ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది.  అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద  ట్రేడ్‌ అవుతోంది. 

అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్‌జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.

ఎస్‌టీటీ దెబ్బ
ఫ్యూచర్స్ అండ్‌  ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు  షాకిచ్చేలా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రూపాయి ఢమాల్‌ 
క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67. 

కాగా కేంద్ర బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ,  మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)