Breaking News

కేంద్ర బడ్జెట్‌ 2026: ‘మౌలిక’ మద్దతు మరింత పెరగాలి

Published on Wed, 01/28/2026 - 12:51

2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమీపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ  నేపథ్యంలో, దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకైన మౌలిక సదుపాయాల రంగం మరింత ప్రభుత్వ వ్యయం, విధాన మద్దతు, ప్రాజెక్టుల వేగవంతమైన  అమలును ఆశిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా మూలధన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, భూసేకరణ, టెండరింగ్ విధానాలు, నియంత్రణ సంబంధిత సమస్యల కారణంగా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతూ, ఖర్చులు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సవాళ్లను అధిగమించేందుకు రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రధాన ప్రభుత్వ ఆస్తుల కోసం కేటాయింపులను కనీసం 10–15 శాతం వరకు పెంచాలని రంగం డిమాండ్ చేస్తోంది.

అదే విధంగా, కేవలం తక్కువ బిడ్ ఆధారిత టెండరింగ్ విధానాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సాంకేతిక సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, గత అమలు పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వాటాదారులు సూచిస్తున్నారు. ఇది ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వడమే కాకుండా దీర్ఘకాలికంగా మెరుగైన ఆస్తి సృష్టికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాన మెట్రో నగరాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు సమగ్ర ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చేందుకు, టైర్-టూ, టైర్-త్రీ నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని పరిశ్రమ కోరుతోంది.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ

రాబోయే బడ్జెట్‌లో బలమైన ఆర్థిక మద్దతు, వేగవంతమైన అమలు విధానాలు మరియు సౌకర్యవంతమైన టెండరింగ్ నిబంధనలు మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని మరింత వేగవంతం చేసి, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తాయని రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు.

రూ.13 లక్షల కోట్లు కేటాయించాలి
మూలధన వ్యయానికి గత బడ్జెట్‌లో రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. హైదరాబాద్‌లో అమలవుతున్న మా రూ.215 కోట్ల మురుగునీటి ప్రాజెక్టులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. రానున్న 2026 బడ్జెట్‌లోనూ నీటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి అవసరం. నమామి గంగే పథకం కింద 7,000 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం కోసం పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పట్టణ ప్రాంతాల్లో సర్క్యులర్ వాటర్ రీయూజ్ వంటి చర్యలు కీలకం. ఈ నేపథ్యంలో రూ.12–13 లక్షల కోట్ల స్థిరమైన మూలధన వ్యయాన్ని మౌలిక రంగం అంచనా వేస్తోంది.
– సునీల్ ఎస్. నాయర్, సీఈఓ, రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)