Breaking News

అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!

Published on Mon, 09/22/2025 - 12:07

కొత్త హెచ్‌-1బి వీసాల (H-1B Visa) ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన వేళ మరో ప్రముఖ దేశం యూకే.. కీలక ప్రతిపాదనల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.

ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసే ఎంపికలను స్టార్మర్‌కు చెందిన "గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" చర్చిస్తోంది.

యూకే (UK)గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు ఖర్చు అవుతుంది. నిపుణుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే రుసుము వర్తిస్తుంది. దీంతో పాటు దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు వార్షిక హెల్త్‌కేర్‌ సర్ ఛార్జ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

2020లో ప్రవేశపెట్టిన ఈ వీసా విధానం.. సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మెడిసిన్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగాల్లో గుర్తింపు పొందినవారికి యూకేలో ఉండే అవకాశం కల్పిస్తుంది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వీసా ఫీజు నిర్ణయంతో బ్రిటన్‌లో సంస్కరణల కోసం ఒత్తిడులు ఊపందుకున్నట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపినట్లుగా నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు