Breaking News

యూఏఈ నుంచి పెట్టుబడుల వెల్లువ

Published on Tue, 06/13/2023 - 06:29

గతేడాది సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి భారత్‌కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22లో అతి పెద్ద ఇన్వెస్టర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న యూఏఈ 2022–23 నాలుగో స్థానానికి చేరింది. 2021–22లో 1.03 బిలియన్‌ డాలర్ల చేయగా గత ఆర్థిక సంవత్సరం దానికి మూడు రెట్లు అధికంగా 3.35 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది.

పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ ఆంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 2022–23లో 17.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్‌ అతి పెద్ద ఇన్వెస్టరుగా నిల్చింది. మారిషస్‌ (6.1 బిలియన్‌ డాలర్లు), అమెరికా (6 బిలియన్‌ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపరమైన సహకారం వేగంగా పటిష్టమవుతుండటం ఇన్వెస్ట్‌మెంట్ల రాకకు దోహదపడుతోందని శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కంపెనీ పార్ట్‌నర్‌ రుద్ర కుమార్‌ పాండే తెలిపారు.

భారత్‌లో యూఏఈ ప్రధానంగా సర్వీసెస్, సముద్ర మార్గంలో రవాణా, నిర్మాణం, విద్యుత్‌ తదితర రంగాల్లో ఉంటున్నాయి. భారత్, యూఏఈ కుదుర్చుకున్న సమగ్ర ఎఫ్‌టీఏ గతేడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో సుంకాల సమస్య లేకుండా ఒక దేశ మార్కెట్లో మరో దేశం తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవడానికి వీలు లభించింది. అలాగే పెట్టుబడులను పెంచుకునేందుకు నిబంధనలను కూడా సడలించారు. 2000 ఏప్రిల్‌ నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌కి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) యూఏఈ వాటా 2.5 శాతంగా ఉంది. ఈ వ్యవధిలో యూఏఈ 15.6 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)