Breaking News

రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్

Published on Tue, 09/23/2025 - 14:47

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. ఈ తరుణంలోనే రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సీఈఓలు(CEO)గా భారతీయుల పేర్లను ప్రకటించాయి.

అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్‌ (T-Mobile).. సీఈఓగా 'శ్రీని గోపాలన్' పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీని.. నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.

గోపాలన్.. హిందూస్తాన్ యూనిలీవర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా  జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్‌లలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కంపెనీకే (టీ-మొబైల్‌) సీఈఓగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి: ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

చికాగోకు చెందిన పానీయాల దిగ్గజం.. మోల్సన్ కూర్స్ (Molson Coors) కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్‌ను నియమించింది. అక్టోబర్ 1నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అన్నారు. ఈయన మైసూర్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. భారతదేశంలోని కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)