Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
మస్క్ సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?
Published on Tue, 11/08/2022 - 12:41
న్యూఢిల్లీ:టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరవాత తమ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిందంటూ ప్రకటనదారులకు భరోసా ఇస్తోంది ట్విటర్. ఈ విషయాన్ని ప్రపంచ బిలియనీర్ ట్విటర్ బాస్ మస్క్ ట్విటర్‌లో షేర్ చేశారు. బ్లూటిక్ ఫీజు, భావ ప్రకటనా స్వేచ్ఛ, విద్వేషపూరిత కంటెంట్, ఇతర గందరగోళాల మధ్య యూజర్లు ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లకు తరలిపోతున్నారన్న అంచనాల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
Twitter usage is at an all-time high lol
— Elon Musk (@elonmusk) November 8, 2022
తమ రోజువారీ వినియోగదారుల వృద్ధి "ఆల్-టైమ్ హై"కి చేరుకుందని ట్విటర్ తన ప్రకటనదారులకు తెలిపింది. గత వారం ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత మానిటైజబుల్ డైలీ యూజర్ (mDAU) వృద్ధి 20 శాతానికి పైగా వేగం పుంజుకుందని,1.5 కోట్ల అదనపు యూజర్లు చేరారని ట్విటర్ పత్రాల ఆధారంగా ది వెర్జ్ నివేదించింది. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్‌లో అమెరికాలో మరింత వేగంగా పెరుగుతోంది. ట్విటర్ తాజా 15 మిలియన్ల కంటే ఎక్కువ mDAUలను జోడించుకొని, క్వార్టర్ బిలియన్ మార్క్‌ను దాటింది. అంతకుముందు 16.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
I just hope the servers don’t melt!
— Elon Musk (@elonmusk) November 8, 2022
కాగా ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఆదాయం ఒక శాతం పడిపోయి 1.18 బిలియన్ డాలర్లకు, ఆ తరువాత క్వార్టర్‌లో 270 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇది ప్రకటనదారులను ప్రభావితం చేసింది. ఇక తాజా పరిణామల నేపథ్యంలో సమస్యాత్మక కంటెంట్‌తో పాటు తమ ప్రకటనలు కనిపించవచ్చనే ఆందోళనతో ఇప్పటికే వోక్స్‌వ్యాగన్ గ్రూప్ అనేక ఇతర కంపెనీలతో కలిసి ట్విటర్‌లో యాడ్స్‌ను నిలిపివేసింది. అలాగే డానిష్ బ్రూయింగ్ కంపెనీ కార్ల్స్‌బర్గ్ గ్రూప్ కూడా తన మార్కెటింగ్ బృందాలకు దాదాపు ఇలాంటి సలహానే ఇచ్చింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా ప్రకటనలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Tags : 1