Breaking News

ట్విటర్‌కు ఆస్ట్రేలియా డెడ్‌లైన్‌: ఉద్యోగులను తొలగించిన పాపం ఊరికే పోతుందా?

Published on Thu, 06/22/2023 - 12:06

ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ట్విటర్‌కు జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ సంస్థ హెచ్చరించింది. ఎలాన్ మస్క్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ట్విటర్‌లో విషపూరిత, విద్వేష కంటెంట్‌ పెరిగిపోయిందని ఆరోపించింది. 

ఆన్‌లైన్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఆస్ట్రేలియాలో నమోదవుతున్న ఫిర్యాదులలో మూడింటిలో ఒకటి ట్విటర్‌పై ఉంటోందని  ఆ దేశ ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అన్నారు. ఆమె ట్విటర్ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం.

వైఫల్యాన్ని సవరించుకోవడానికి ట్విటర్‌కు 28 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు దాటితే రోజుకు 7 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.3.9 కోట్లు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌మాన్ గ్రాంట్ తెలిపారు.

ఉద్యోగుల తొలగింపుతో చిక్కులు
మస్క్‌ 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో 80 శాతం ఉద్యోగులను తొలగించారు. వీరిలో కంటెంట్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పనిచేసే కంటెంట్ మోడరేటర్‌లు కూడా చాలా మంది ఉన్నారు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించే గ్లోబల్ డ్రైవ్‌కు ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తోంది. ఇన్మాన్ గ్రాంట్ ట్విటర్‌ ట్విటర్‌ తప్పులను ఎత్తిచూపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లోనే ఆమె మస్క్‌కి లేఖ రాశారు. సంస్థలో మితిమీరిన ఉద్యోగుల తొలగింపులు ఆస్ట్రేలియన్ చట్టాలను అందుకోలేకపోవడానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ట్విటర్‌లో జాత్యాహంకార వ్యాఖ్యలకు తాను గురైనట్లు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ స్టాన్ గ్రాంట్ పేర్కొన్నారు. దీనిపై గత మే నెలలో ట్విటర్‌ యాజమాన్యానికి తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Olx Layoffs: ఓఎల్‌ఎక్స్‌లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)