Breaking News

అతని కోపం ప్రళయం.. మస్క్‌ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని

Published on Thu, 07/27/2023 - 16:28

ట్విటర్‌ మాజీ ఉద్యోగిని ఎస్తేర్ క్రాఫోర్డ్.. ఈమె పేరు చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.  క్రాఫోర్డ్‌ ట్విటర్‌లో పనిచేస్తున్నప్పుడు రాత్రిళ్లు అక్కడే ఆఫీస్‌లోనే నిద్రిస్తున్న ఫొటో గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన తెలిసిందే.

ప్రొడక్ట్ మేనేజర్‌గా అంతలా కష్టపడి పనిచేసినా ఆమెను ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కనికరించలేదు. ట్విటర్‌ గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం​ కూడా పోయింది. ఇదంతా తెలిసిందే. అయితే ఐదు నెలల తర్వాత ఆమె మస్క్‌తో పనిచేయడం ఎలా ఉంది, ఆయన అసాధారణ ప్రవర్తన ఉద్యోగులను ఎలా భయపెట్టేది తదితర ఆసక్తికర విషయాలు తెలియశారు. 

ఎలాన్ మస్క్ ఆధీనంలో లేక ముందు ఇతర కంపెనీల మాదిరిగానే ట్విటర్‌ కూడా చాలా బాగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం పని చేస్తేనే సరిపోదు.. రాజకీయాలు కూడా చేస్తేనే రాణిస్తారంటూ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవల ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌లో రాశారు.

అపరిచితుడు!
ఇక ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేయడం గురించి వివరిస్తూ.. “వ్యక్తిగతంగా ఎలాన్ మస్క్‌ చాలా అసాధారణంగా ఉంటాడు. కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు. చెప్పన కథలు, జోకులే  పదే పదే చెప్తాడు” అని పేర్కొంది. ఇక ఉద్యోగులు ఎదుర్కొన్న సవాలు ఏమిటంటే, మస్క్‌ ఉత్సాహంగా ఉన్న బాస్ నుంచి క్షణాల్లో కోపంగా మారిపోతాడని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి ➤ 'X' Replacing Twitter Blue Bird Logo: పిట్ట పోయి ‘ఎక్స్‌’ వచ్చె.. మారిపోయిన ట్విటర్‌ లోగో

"అతను ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో ఉంటాడో, ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిస్తాడో అంచనా వేయడం చాలా కష్టం. దీంతో మీటింగ్‌కి పిలిచినప్పుడల్లా ఉద్యోగులు భయపడేవారు. ఆయనతో ప్రతికూల విషయాలను చర్చించడానికి సంశయించేవారు" అని క్రాఫోర్డ్‌ పేర్కొన్నారు.

కాగా 2022 నవంబర్‌లో ట్విటర్‌ భారీ తొలగింపులు చేపట్టిన సమయంలో ఎస్తేర్ క్రాఫోర్డ్.. తాను ఆ కంపెనీలో ఉన్నందుకు సంతోషిస్తున్నానంటూ మస్క్‌ ఆలోచనలను సమర్థించడంపై సోషల్‌ మీడియాలో ఆమెపై విపరీతంగా విమర్శలు వచ్చాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)