Breaking News

తడబడిన ట్విటర్.. నిమిషాల్లో వేల పిర్యాదులు

Published on Fri, 02/24/2023 - 10:13

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ వినియోగంలో నిన్న (గురువారం) కొంత అంతరాయం ఏర్పడింది. భారతదేశంలో ఈ సైట్‌లోకి లాగిన్ అవ్వడంతో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు తెలిపారు. దీని వల్ల వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్స్ రెండూ ప్రభావితమయ్యాయి.

నివేదికల ప్రకారం, రాత్రి 10:18 గంటల సమయంలో చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపైన సుమారు 5,400 మంది ఫిర్యాదులు చేశారు. డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం.. భారతదేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నుంచి ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ట్విటర్ వినియోగదారులు కొంత సమయం ఈ ప్లాట్‌ఫారమ్‌ ఆపరేట్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇందులో సుమారు 56 శాతం ఫిర్యాదులను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నుంచి, 37 శాతం వెబ్‌సైట్‌ వినియోగదారులు, 8 శాతం సర్వర్ కనెక్షన్‌లో సమస్యలను నివేదించారు.

(ఇదీ చదవండి: డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే)

ట్విటర్ వినియోగంలో అంతరాయం ఏర్పడిన కొద్ది నిమిషాలలోనే మళ్ళీ యధావిధిగా పని చేయడం ప్రారంభించింది. ఆ తరువాత వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సైట్ మునుపటి మాదిరిగానే పనిచేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా ట్విటర్ సంస్థ భారతదేశంలోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేసింది. ఈ రెండు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకుంటూ సోషల్ మీడియా సేవల్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)