Breaking News

ట్వీట్‌లపై ఆంక్షలు.. సమర్ధించిన సీఈవో లిండా యాకరినో

Published on Wed, 07/05/2023 - 10:53

ట్విటర్ యూజర్లు రోజులో చదివే ట్వీట్లపై ఎలాన్ మస్క్‌ పరిమితులు విధించారు. అయితే, ట్విటర్‌ బాస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో సమర్ధించారు. స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకు తాత్కాలిక పరిమితిని విధించినట్లు తెలిపారు. 

జులై 1న నాన్‌ వెరిఫైడ్‌ యూజర్లు రోజుకు 600 ట్వీట్‌లను చదివేందుకు మస్క్‌ అనుమతిచ్చారు. వెరిఫైడ్‌ యూజర్లు 6,000, కొత్తగా ట్విటర్‌ను వినియోగిస్తున్న యూజర్లు 300 ట్వీట్‌లను చదివే వెసలు బాటు కల్పించారు.   

తాజాగా, ట్విటర్‌లో చేస్తున్న మార్పులపై లిండా యాకరినో స్పందించారు. ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేసేందుకు ఈ తరహా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ సైతం అర్థవంతమైనదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫేక్‌ యూజర్లకు చెక్‌ పెట్టేలా 
స్పామ్ ఖాతాలను అరికట్టేలా చదివే ట్వీట్‌లపై ట్విటర్‌ తాత్కాలికంగా పరిమితులు విధించింది. తద్వారా, ప్లాట్‌ఫారమ్ నుండి స్పామ్, బాట్‌లను తొలగించడానికి తీవ్ర చర్యలు అవసరమని ట్విటర్‌ నివేదించింది. ఈ చర్యల వల్ల ఫేక్‌ ట్విటర్‌ యూజర్లు.. సురక్షితంగా ఉండేందుకు చేసే ప్రయత్నాలకు  అవకాశం ఇవ్వకుండా పోతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

తటస్థంగా ట్విటర్‌ 
మస్క్‌ ఊహించని నిర్ణయం కొద్ది మంది వినియోగదారుల్ని మాత్రమే ప్రభావితం చేసిందని, ప్రకటనలు మారినప్పటికీ అవి స్థిరంగా ఉన్నాయని ట్విటర్ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ను అందరికి ఆమోదయోగ్యంగా మార్చడంపైనే దృష్టిసారించినట్లు ట్విటర్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

చదవండి👉 ఎవరీ లిండా? ట్విటర్‌ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)