Breaking News

యాపిల్‌కు ట్రంప్‌ వార్నింగ్‌.. భారత్‌లో ఐఫోన్‌ తయారు చేస్తే..

Published on Fri, 05/23/2025 - 18:05

వాష్టింగ్టన్‌: భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన  ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్‌లను దేశీయంగా అమ్మితే  25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. 

ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌ సోషల్‌గా ఓ వేదికగా ఓ పోస్టును షేర్‌ చేశారు. అందులో ‘నేను చాలా కాలం క్రితమే నేను ఈ విషయాన్ని యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్‌తో పాటు మరో ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై యాపిల్ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే’అని పేర్కొన్నారు.    

అయితే, ట్రంప్ విధించే టారిఫ్‌లు యాపిల్ ఒక్క కంపెనీకే ప‌రిమితం అవుతుందా? లేదంటే అన్నీ కంపెనీల‌పై సుంకం విధిస్తారా? అన్న‌ది స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మరోవైపు, అమెరికా,చైనా సుంకాల యుద్ధంతో అవ‌రోధాలు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ త‌యారీకి భార‌త్ ప్ర‌త్యాహ్నాయంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భార‌త్‌లో భారీ ఎత్తున త‌యారీ రంగంలో పెట్టుపెట్టేందుకు సిద్ధ‌మైంది. కాగా, యాపిల్ నివేదిక ప్ర‌కారం.. జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఫోన్లలో ఎక్కువ శాతం భారత్‌లో త‌యారు చేసిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)