Breaking News

'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్

Published on Sat, 09/13/2025 - 19:54

డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.

అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్‌గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.

రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అని అన్నారు.

ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

జో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్‌స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)