Breaking News

టారిఫ్‌లతో జీడీపీపై ఎఫెక్ట్‌ 

Published on Thu, 07/31/2025 - 05:33

న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్‌ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్‌ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. 

ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.   మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ హర్ష వర్ధన్‌ అగర్వాల్‌ తెలిపారు.  టెక్స్‌టైల్స్‌ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్‌టైల్‌ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)