Breaking News

కీలక ఉత్పత్తిపై ట్రంప్‌ 50 శాతం సుంకం

Published on Wed, 07/09/2025 - 13:20

ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్‌ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్‌ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్‌ దిగుమతి చేసుకునే కాపర్‌పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం  తెలియజేయలేదు.

ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్‌ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్‌కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్‌లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్‌ కాపర్‌ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.

ఫార్మాపై కూడా..

అమెరికా ప్రస్తుతం తన కాపర్‌ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్‌పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్‌ సమావేశంలో ట్రంప్‌ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్‌

కాపర్‌పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావం

ఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.

నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్‌లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.

డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)