Breaking News

టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!

Published on Wed, 03/01/2023 - 18:33

టయోటా లగ్జరీ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆ కంపెనీ కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందుకే వాటి అమ్మకాలు భారీగా పెరిగాయి. తమ కార్ల అమ్మకాలు ఏడాదిలో 75 శాతం పెరిగి 2023 ఫిబ్రవరిలో 15,338 యూనిట్లకు చేరుకున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌ తాజాగా తెలియజేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్‌లో 8,745 కార్లను విక్రయించింది.

‘మా ఉత్పత్తులపై కస్టమర్ల అమితమైన ఆసక్తి కొనసాగుతోంది. దీని ఫలితంగా 2023 ఫిబ్రవరిలో చాలా మంచి వృద్ధి నమోదైంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌ సేల్స్ అండ్‌ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.

(ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్‌’ టెక్నాలజీ!)

ఈ అమ్మకాల వృద్ధిలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ అగ్రగామిగా ఉన్నాయని,  కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తమ భాగస్వాములతో కలిసి మరింతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన టయోటా హిలక్స్ కోసం బుకింగ్‌లకు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లాంజా, ఫార్చూనర్, లెజెండర్ వంటి వాటికి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందన్నారు.

(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)