Breaking News

దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా

Published on Sat, 10/18/2025 - 17:01

టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్‌ను పొందుతుంది.

కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్‌లో.. బంపర్‌కు మరింత దూకుడుగా ఉండే లుక్‌ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్‌కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్‌ని తెచ్చే సైడ్ స్కర్ట్‌లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా

హైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది  5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)