Breaking News

ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు

Published on Sun, 12/14/2025 - 15:32

ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్‍వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)
రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్‍వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.

అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)
పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్‌ల నుండి వస్తుంది. ఈయన నెట్‍వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్‍వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.

కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్‍వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.

జీ జిన్‌పింగ్ (Xi Jinping)
బ్లూమ్‌బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్‌పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్‌లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.

ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)