Breaking News

మే నెలలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!

Published on Sun, 06/07/2026 - 18:36

మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది.  టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.

  • అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.

  • రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్‌లో హాట్ సెల్లింగ్ మోడల్‌గా మారింది.

  • మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.

  • నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.

  • ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.

  • ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.

  • ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్‌లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి.

  • తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.

ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)