Breaking News

డబ్బులు చెట్లకు కాయడం అంటే ఇదే మరి.. టమాటతో లక్షలు సంపాదించొచ్చు!

Published on Fri, 07/21/2023 - 12:28

Tomato Farming Business In India: గత కొన్ని రోజులుగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల ఆశలు చిగురించాయి. టమాటాలు పండించిన రైతులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. కావున ఏదైనా బిజినెస్ చేసి మంచి లాభాలను పొందాలనుకునే వారికి టమాటా సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

నేడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే కేవలం కంపెనీలు ప్రారభించడమో, లేకుంటే లెక్కకు మించిన డబ్బు వెచ్చించి ఇతర వ్యాపారాలు చేయడమనేది మాత్రమే ఏకైక మార్గం కాదు.. ఆధునిక కాలంలో వ్యవసాయం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చని కొంతమంది చెబుతున్నారు, మరి కొందరు నిరూపిస్తున్నారు. ఇటీవల టమాటాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న రైతులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము.

నిజానికి దేని అవసరం ఎప్పుడు ఉంటుందో.. ఉండదో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ప్రతి రోజు టమాటాల అవసరం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం టమాటా కూరలకు మాత్రమే కాకూండా సాస్, పిజ్జా వంటి వాటిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కావున సరైన పద్దతిలో టమాటా సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయన్నది నిజం.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది టమాట సాగు చేస్తారు. ఒక హెక్టారులో వివిధ రకాలకు లోబడి 800 నుంచి 1200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సరైన వ్యవసాయ పద్ధతులతో, ఈ పంటను పండించడం ద్వారా బంపర్ లాభాలను పొందవచ్చు.

(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)

టమాట సాగు సంవత్సరానికి రెండు సార్లు చేసుకోవచ్చు. జూలై & ఆగస్టు నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు.. నవంబర్ & డిసెంబర్ నుంచి మొదలై జూన్-జూలై వరకు ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో 15,000 మొక్కలను పెంచవచ్చు. 2 నుంచి 3 నెలల వ్యవధిలో టమాటాలు రావడం మొదలవుతాయి. కొన్ని సార్లు పంట దిగుబడి తగ్గినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఆశించిన లాభాలను పొందవచ్చు.

(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)

ప్రస్తుతం మన దేశంలో కేజీ టమాటాల ధర రూ. 120 వరకు ఉంది. దీంతో రైతులు ఊహకందని మంచి లాభాలను పొందగలుగుతున్నారు. టమాట సాగు చేసే రైతు సగటున కేజీ రూ. 10కి విక్రయిస్తే 1000 క్వింటాళ్లకు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కావున టమాట సాగుతో కూడా తప్పకుండా లాభాలను పొందే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)