Breaking News

టైమ్స్‌ మాగజైన్‌ 100: ఈ రంగం నుంచి వీరిద్దరే, ఆ సూపర్‌స్టార్లు ఎవరంటే?

Published on Thu, 04/13/2023 - 20:55

సాక్షి ముంబై: టైమ్ మ్యాగజైన్ 2023లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  షారూక్‌ ఖాన్, టాలీవుడ్‌ దర్శక దిగ్గజం, ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి చోటు సంపాదించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బిలియనీర్ ఎలాన్ మస్క్,హాలీవుడ్ దిగ్గజాలు ఏంజెలా బాసెట్, మైఖేల్ బి జోర్డాన్ , కోలిన్ ఫారెల్ లాంటి ప్రముఖుల ఎలైట్ వార్షిక జాబితాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి వీరు మాత్రమే చోటు  దక్కించుకోవడం విశేషం.  (రిలయన్స్‌ ఫౌండర్‌ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు)

గత వారం టైమ్ మ్యాగజైన్ ఆన్‌లైన్ పోల్‌లో షారూక్‌ టాప్‌లో నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల స్థానానికి నిర్వహించిన ఈ పోల్‌లో లియోనెల్ మెస్సీ, ప్రిన్స్ విలియం, ట్విటర్‌ బాస్‌ ఎలాన్ మస్క్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ షారూక్‌ టాప్‌లో నిలిచారు. (టాటా, బిర్లా సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే? అనంత్‌, రాధికా మర్చంట్‌ అడోరబుల్ ‌వీడియో వైరల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ సంచలనం తరువాత ఎస్‌ఎస్‌ రాజమౌళి  ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖంగా నిలిచారు.  డోజా క్యాట్, బెల్లా హడిద్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారితో పాటు పయనీర్స్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)

కాగా బాలీవుడ్‌ పఠాన్‌ మూవీ ఫారూక్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక సంచలనాలునమోదు చేసిన టాలీవుడ్‌ మూవీ   ఆర్‌ఆర్‌ఆర్‌ గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించడమేకాదు, ఆస్కార్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను  కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)