Breaking News

భారత్‌లోకి మళ్ళీ టిక్‌టాక్‌?: మొదలైన నియామకాలు

Published on Sun, 08/31/2025 - 15:36

భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్‌టాక్‌' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్‌లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్‌టాక్‌ మళ్ళీ భారత్‌లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

బైట్‌డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కంపెనీ వెబ్‌సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్‌టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.

టిక్‌టాక్ వెబ్‌సైట్‌లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్‌టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.

ఇదీ చదవండి: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలా

టిక్‌టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్‌టాక్‌కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్‌టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.

భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి