Breaking News

హోండా అమేజ్‌ థర్డ్‌ జనరేషన్‌ వచ్చేసింది..

Published on Thu, 12/05/2024 - 13:44

కార్ల తయారీలో ఉన్న జపాన్‌ సంస్థ హోండా మూడవ తరం అమేజ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్‌ షోరూమ్‌లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్‌ సెడాన్‌ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.

దేశంలో అడాస్‌ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్‌ అని హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్‌ కార్లను విక్రయించింది. అమేజ్‌ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్‌ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కునాల్‌ బెహల్‌ పేర్కొన్నారు.  

2027 నాటికి మరో మూడు మోడళ్లు 
హోండా 2027 మార్చి నాటికి భారత్‌లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో ఎలివేట్‌ ఎస్‌యూవీతోపాటు సెడాన్స్‌ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.

2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రెయిన్‌లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్‌కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)