Breaking News

అవును.. భారత్‌కు టెస్లా వస్తోంది

Published on Wed, 06/21/2023 - 09:09

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో, ట్విటర్‌ అధినేత ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు . ఈ సమావేశం అనంతరం భారత్‌లో టెస్లా భవిష్యత్తు గురించి ఎలాన్ మస్క్ మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశం మంచి కోసం ఆలోచిస్తున్నారని, దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు. అదే సమయంలో ఇది దేశానికి ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీ భారత్‌కు ఆహ్వానించారా.. తాత్కాలిక ప్రణాళికలను ఆయనతో పంచుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మస్క్‌ అవునని సమాధానమిచ్చారు. మోదీ తనను భారత్‌కు ఆహ్వానించారని,  వచ్చే ఏడాది భారత్‌ సందర్శించే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.

 ఈ ఏడాది చివరికల్లా.. 
భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటును ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్‌ మాట్లాడుతూ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఈ ఏడాది చివరికల్లా ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాలో బిజినెస్‌ లీడర్లతో సమావేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు.  మోదీని మరోసారి కలవడం గౌరవంగా ఉందంటూ రీట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌: ఏ వాహనానికి ఎంతెంత? ప్రీమియం రేట్ల ప్రతిపాదనలు.. 

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)