Breaking News

భారత్‌కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!

Published on Wed, 12/11/2024 - 13:58

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్‌ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.

భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్‌లో మస్క్‌ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.

రాయిటర్స్ రిపోర్ట్‌ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్‌ కోసం దేశంలో  అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్‌ఎఫ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ అవెన్యూ మాల్, గురుగ్రామ్‌లోని సైబర్ హబ్‌తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.

వాహన డెలివరీలు, సర్వీసింగ్‌ సదుపాయంతో పాటు కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం  కంపెనీ ఇతర డెవలపర్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)